Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం ఊపందుకుంది. మొత్తం రూ.81,317 కోట్ల విలువైన ప్రాజెక్టులను క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఆర్డీయే) ప్రతిపాదించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఆర్డీయే, ఏడీసీ అధికారులతో పాటు నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రస్తుతం రూ.50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచినట్లు సీఎం వివరించారు. 74 కీలక ప్రాజెక్టుల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది. ఇందులో హౌసింగ్, వాణిజ్య భవనాలు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు, వరద నియంత్రణ పనులు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు అమరావతిని ఆధునిక, సమర్థవంతమైన రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో రూపొందాయి.
ALSO READ: https://teluguprabha.net/ap-district-news/amaravati/ap-capital-amara…projects-started/
సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణ పనులను రికార్డు సమయంలో పూర్తి చేయాలని, గుణాత్మకతపై రాజీ పడకూడదని సూచించారు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని, పర్యావరణ అనుకూలతతో పాటు ఆధునిక సౌకర్యాలను కల్పించాలని ఆయన ఒక్కించారు.
ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చేందుకు చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం కృషి చేస్తోంది.


