Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుఅమరావతిAp Government: హద్దులు దాటారో..కఠిన చర్యలు తప్పవు..ఏపీ సర్కారు సంచలన నిర్ణయం!

Ap Government: హద్దులు దాటారో..కఠిన చర్యలు తప్పవు..ఏపీ సర్కారు సంచలన నిర్ణయం!

Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియాలో నియంత్రణకు కఠిన చర్యలు తీసుకునే దిశగా ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఫేక్ పోస్టులు, అసత్య ప్రచారాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యను అరికట్టేందుకు చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరిగింది.

- Advertisement -

సోషల్ మీడియా..

సోషల్ మీడియాలో అనేక మంది నిర్ధారణ లేని సమాచారం పంచుకోవడం వల్ల గందరగోళం సృష్టవుతోందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఏది నిజమో, ఏది అబద్ధమో ప్రజలకు అర్థం కాకపోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ తరహా దుష్ప్రచారాలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించింది.

తప్పుడు ప్రచారాలకు..

ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పలు సందర్భాల్లో తప్పుడు ప్రచారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి బాధ్యత ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఎవరు ఏదైనా సమాచారం పంచుకుంటే, దానికి సరైన ఆధారం చూపాల్సిన అవసరం ఉంటుందని కూడా పేర్కొన్నారు.

ఆధార్ వంటి గుర్తింపు పత్రాలతో..

ఈ క్రమంలో ప్రభుత్వం కొత్త చట్టం రూపకల్పనపై దృష్టి సారించింది. సోషల్ మీడియా అకౌంట్లను ఆధార్ వంటి గుర్తింపు పత్రాలతో అనుసంధానం చేస్తే ఫేక్ అకౌంట్లను నియంత్రించవచ్చని అధికార వర్గాలు పరిశీలిస్తున్నాయి. ఈ విధంగా తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టడమే కాకుండా, వాటిని పోస్ట్ చేసే వ్యక్తులను గుర్తించడం సులభమవుతుందని భావిస్తున్నారు.

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పోలీసులు సోషల్ మీడియా పోస్టులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎవరు పోస్టులు పెడితే, వాటికి సంబంధించిన ఆధారాలు సమర్పించాలని కోరుతున్నారు. ఆధారాలు ఇవ్వలేకపోతే, ఆ పోస్టుల స్వభావాన్ని బట్టి చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల సోషల్ మీడియాలో నిరాధారమైన సమాచారాన్ని వ్యాప్తి చేయాలనుకునే వారు వెనుకడుగు వేస్తారని అధికారులు చెబుతున్నారు.

ప్రత్యేక కేబినెట్‌ సబ్ కమిటీ..

సోషల్ మీడియా పర్యవేక్షణకోసం ప్రభుత్వం ప్రత్యేక కేబినెట్‌ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొత్త చట్టాల రూపకల్పన, అమలు ప్రక్రియ, పోలీసులకు ఇవ్వాల్సిన అధికారం వంటి అంశాలపై సవివరంగా చర్చిస్తోంది. ఈ చట్టాలు అమలులోకి వస్తే, అసత్య ప్రచారాలపై గట్టి నియంత్రణ సాధ్యమవుతుందని భావిస్తున్నారు.

యూరియా సరఫరా విషయం..

ఇక యూరియా సరఫరా విషయంలో కూడా ఇటీవల కొన్ని తప్పుడు ప్రచారాలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల సమస్య లేనప్పటికీ, ప్రతిపక్ష పార్టీ తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని ముఖ్యమంత్రి కేబినెట్‌లో స్పష్టంచేశారు. ఆ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవడంలో కొంతమంది నేతలు, మంత్రులు తగిన విధంగా స్పందించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ichandrababu-speech-international-mediation-conference-vizag-2025/

చంద్రబాబు నాయుడు స్పష్టంచేసిన మరో అంశం ఏమిటంటే, వ్యక్తిగత దూషణలు చేసే పోస్టులపైనా కఠిన చర్యలు ఉండాలి. ఎవరి మీదైనా తప్పుడు ఆరోపణలు చేయడం లేదా వ్యక్తిగతంగా అవమానించేలా వ్యవహరించడం చట్ట విరుద్ధమని ఆయన హితవు పలికారు. ఈ తరహా పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేలా చట్టపరమైన మార్గాలను పరిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad