AP liquor scam:ఆంధ్రప్రదేశ్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపించిన మద్యం కుంభకోణంలో నిందితులకు ఈరోజు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ సిట్ (SIT), ఇప్పటికే రెండు ఛార్జిషీట్లను కోర్టులో దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను విజయవాడ ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
Forex Reserves: సరికొత్త రికార్డుకు భారత ఫారెక్స్ రిజర్వ్స్.. ఆర్బీఐ తాజా రిపోర్ట్
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, జగన్ కార్యాలయంలో పనిచేసిన ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి,భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని సిట్ అధికారులు వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
అంతేకాకుండా, ఈ కేసులో ఇంకా అరెస్టు కాని నిందితులు వాసుదేవరెడ్డి ,సత్యప్రసాద్ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా కోర్టు తోసిపుచ్చింది. దీంతో వారిని కూడా సిట్ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ మొత్తం కేసులో జగన్‌ను నిందితుడిగా చేరుస్తారని గతంలో జరిగిన ప్రచారాన్ని ఈ పరిణామాలు తోసిపుచ్చాయి.
సిట్ దాఖలు చేసిన రెండు ఛార్జిషీట్లలోనూ జగన్ పేరు నిందితుడిగా లేకపోవడం గమనార్హం. దీంతో జగన్ అరెస్టు అంటూ చేసిన ప్రచారం ఒట్టిదే అని స్పష్టమైంది. ఈ కేసులో ఇతర నిందితులకు మాత్రం కోర్టు నుంచి ఎటువంటి ఊరట లభించకపోవడంతో వారికి కష్టాలు తప్పడం లేదు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.


