Saturday, November 15, 2025
HomeAP జిల్లా వార్తలుఅమరావతిAP Mega Cities Plan : ఏపీలో మూడు మెగా సిటీలు: విశాఖ–అమరావతి–తిరుపతికి రూ.1 లక్ష...

AP Mega Cities Plan : ఏపీలో మూడు మెగా సిటీలు: విశాఖ–అమరావతి–తిరుపతికి రూ.1 లక్ష కోట్లు మాస్టర్ ప్లాన్

AP Mega Cities Master Plan : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన 12వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో 26 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి మొత్తం విలువ రూ.1,01,899 కోట్లు. ఇందులో భాగంగా మూడు మెగా సిటీలకు ప్లాన్ అమలుచేయనున్నారు.

- Advertisement -

ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి అనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్ రెడీ అవుతుంది. రూ.1,01,899 కోట్ల బడ్జెట్ తో 26 పారిశ్రామిక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 85,570 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక గత 16 నెలల్లో రూ.8 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

చంద్రబాబు మాట్లాడుతూ, “పారిశ్రామిక ప్రగతి అధికారుల బాధ్యత. పెట్టుబడిదారుల ప్రతిపాదనలు వెంటనే ఆమోదం తెలియచేయాలి. ప్రాజెక్టులు గ్రౌండ్‌ స్థాయిలో ప్రారంభమవ్వాలి” అన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు కేటాయించినా ప్రారంభం కాని ప్రాజెక్టులపై సమీక్ష చేయాలని, పురోగతి లేకపోతే అనుమతులు రద్దు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, చిప్, సెమీకండక్టర్, డ్రోన్ తయారీలకు ప్రోత్సాహం లభించనుందని తెలిపారు. 15 పారిశ్రామిక జోన్లు, క్లస్టర్ విధానం, ల్యాండ్ బ్యాంక్ సిద్ధం చేయాలని సూచించారు.

సీఎం మూడు మెగా సిటీల అభివృద్ధి ప్రణాళికను పునరుద్ఘాటించారు. “విశాఖను అనకాపల్లి నుంచి విజయనగరం వరకు, అమరావతి, తిరుపతిని మెగా సిటీలుగా అభివృద్ధి చేయాలి. అమరావతికి మాస్టర్ ప్లాన్ ఉంది. విశాఖ, తిరుపతికి త్వరలో సిద్ధం చేయాలి. టూరిజం, IT సెంటర్లుగా తీర్చిదిద్దాలి” అని తెలిపారు. మున్సిపల్, పరిశ్రమలు, IT, పర్యాటక శాఖలు సమన్వయం చేసి పని చేయాలని ఆదేశించారు. గూగుల్ డేటా సెంటర్ తర్వాత మరిన్ని కంపెనీలు విశాఖకు వస్తున్నాయని, భూమి లభ్యత చూడాలని అన్నారు. మూడు ఎకనామిక్ కారిడార్లకు ముగ్గురు సీనియర్ IASలను నియమిస్తామని ప్రకటించారు.

ఈ నెల 14, 15న విశాఖలో పెట్టుబడుల సమ్మిట్‌ను ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. విదేశీ పర్యటనల్లో పారిశ్రామికులను ఆహ్వానించాలని తెలిపారు. సమ్మిట్‌లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

చంద్రబాబు విజన్ ప్రకారం “ప్రతి ప్రాజెక్ట్ గ్రౌండ్‌లో ప్రారంభమవ్వాలి. పెట్టుబడిదారులు సంతృప్తి పొందాలి” అని అంచనా వేస్తున్నారు. గత ప్రభుత్వంలో భూములు కేటాయించినా ప్రారంభం కాని ప్రాజెక్టులు ఇప్పుడు వేగవంతమవుతాయని తెలుస్తుంది.

ఇక ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, నారాయణ, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad