Sunday, June 8, 2025
HomeAP జిల్లా వార్తలుఅమరావతిCM condolence: కాన్వాయ్ డ్రైవర్ మృతిపై చంద్రబాబు రియాక్షన్ ఇదే..

CM condolence: కాన్వాయ్ డ్రైవర్ మృతిపై చంద్రబాబు రియాక్షన్ ఇదే..

ఏపీ సీఎం కాన్వాయ్‌లోని(ap cm convoy) డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. అమీన్ బాబు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌లోని వాహనశ్రేణిలో డ్రైవర్‌గా సుదీర్ఘకాలంగా అమీన్‌బాబు విధులు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున అమీన్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.

కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వ పరంగా అమీన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News