AP IAS, IPS officers Transfer: ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ జీఓ వెలువరించింది. గత నాలుగు రోజులుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీపై దృష్టి పెట్టిన ప్రభుత్వం.. ఈరోజు మరి కొంతమంది ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఎస్ అధికారిని స్థానచలనం చేసింది.
ఏలూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న పి. ధాత్రి రెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా ప్రభుత్వం బదిలీ చేసింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మను ఏపీ ఫైబర్‌నెట్ ఎండీగా నియమించింది. పాడేరు సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న శౌర్యమాన్ పటేల్‌ను మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ ఎండీగా బదిలీ చేసింది.
Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/apcc-signature-campaign-vote-theft/
అదేవిధంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ ఐపీఎస్ రాహుల్ దేవ్ శర్మకు ప్రభుత్వం పూర్తిగా అదనపు బాధ్యతలను అప్పగించింది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీఎస్‌బీఎస్‌ఎల్ ఎండీగా అదనపు బాధ్యతలతో పాటు డిస్టిలరీస్ అండ్ బేవరీస్ కమిషనర్‌గా పూర్తి బాధ్యతలను అప్పగిస్తూ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.


