HomeAP జిల్లా వార్తలుఅమరావతిMinister Narayana: 'చివరిదశకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులు.. త్వరలోనే శాఖకు అప్పగిస్తాం'

Minister Narayana: ‘చివరిదశకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులు.. త్వరలోనే శాఖకు అప్పగిస్తాం’

Minister Narayana MLA- MLC Quarters: రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాల నిర్మాణం తుది దశకు చేరుకుందని మంత్రి నారాయణ అన్నారు. ఈ మేరకు అమరావతిలో క్వార్టర్స్‌ను పరిశీలించారు. వారం రోజుల్లో ఎమ్మెల్యేల నివాస భవనాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తామని పేర్కొన్నారు. ఇంటీరియర్ పనులతో పాటు మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/bandi-bhagirath-petition-in-high-court-seeking-quashing-of-pocso-case-against-him/

మరోవైపు గ్రూప్-1, గ్రూప్-2 అధికారుల నివాస భవన నిర్మాణ పనులు కూడా తుది దశలో ఉన్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధానిలో భూములిచ్చిన రైతుల్లో కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందని.. అది కూడా న్యాయపరమైన కారణాల వల్ల ఆలస్యమైందని తెలిపారు. కానీ కావాలనే కొందరు అమరావతిలో ప్లాట్ల కేటాయింపులపై కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News