Nara Lokesh Comments on Amaravati: రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే అందర్నీ ఆకర్షిస్తోందని మంత్రి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులను, పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తూ.. నమ్మకం, ప్రతిష్ఠాత్మక లక్ష్యాలు, ఆంధ్రప్రదేశ్ చక్కటి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తోందన్నారు. ‘‘క్వాంటం ఆపరేషన్స్ కోసం గోపాల్ ముంబయి నుంచి వచ్చారు. పరిశోధకుడు నాగ లక్ష్మయ్య.. అమరావతిలో రేడియో ఫ్రీక్వెన్సీ వ్యవస్థలు నిర్మిస్తున్నారు. చంద్రబాబు విజన్ నమ్మి భవిష్యత్ తరాల కోసం వారు కృషి చేస్తున్నారు. క్వాంటం నిర్మాణంలో సాయపడుతున్న యువత కృషి అభినందనీయం. డీప్-టెక్ హబ్‌కు అమరావతి క్వాంటం వ్యాలీ ఓ స్ఫూర్తి.’’ అని లోకేష్ ట్విట్టర్ వేదికగా పేర్కొ్నారు. అతి త్వరలోనే అమరావతి దేశంలోనే అత్యంత అభివృద్ది చెందిన రాజధానిగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.
Also Read: Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్ అరుదైన ఘనత.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన ఆటగాడిగా రికార్డు

