Pawan Kalyan Bheti With AV Ranganath: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలపాటు వీరి సమావేశం జరిగింది. కాగా, వీరిద్దరి సమావేశం కారణాలపై అధికారికంగా ఎలాంటి ప్రాథమిక సమాచారం అందలేదు.
Also Read: https://teluguprabha.net/gallery/cm-revanth-reddy-visits-jubilee-hills-park-construction-works/
పవన్ కళ్యాణ్, ఏవీ రంగనాథ్ భేటీపై రాజకీయంగా, సామాజిక పరంగా ఉత్కంఠ నెలకొంది. కాగా, హైదరాబాద్‌లో కబ్జాలపై హైడ్రా ఝుళిపిస్తున్న కొరడా సంచలనం సృష్టిస్తోంది. భాగ్యనగరంలో హైడ్రా వంటి ఒక వ్యవస్థ మంచిదే అని గతంలో పవన్ కల్యాణ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా వంటి వ్యవస్థను తీసుకొచ్చి ఏం చేయాలనేదానిపై చర్చిస్తామని కూడా అప్పట్లో ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి సమావేశంతో ఇప్పుడు ప్రాధాన్యత నెలకొంది.
Also Read: https://teluguprabha.net/national-news/bharat-taxi-to-compete-with-ola-and-uber/
హైదరాబాద్‌లో హైడ్రా ద్వారా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ, భవన లే అవుట్ ప్రాజెక్టులు, వర్షాకాలంలో చేపట్టాల్సిన పనులు, పలు సమస్యలపై చర్చ జరిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది.


