- Advertisement -
అమరావతిలోని ఏపీ అసెంబ్లీ(Assembly) ఆవరణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శాసనమండలి చైర్మన్ మోషేన్‌రాజు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో మంగళవారం ఫొటో సెషన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ఏపీ ఎమ్మెల్సీల ఫొటో సెషన్ లో ఆసక్తికర పరిణామాలు

- మీతో ఫొటో దిగడం నా అదృష్టం అంటూ చంద్రబాబుతో డిప్యూటీ ఛైర్మన్ జాకియా ఖానం వ్యాఖ్యలు
- డిప్యూటీ ఛైర్మన్ మాటలకు ఖంగుతిన్న వైసీపీ ఎమ్మెల్సీలు
- మీతో విడిగా ఫొటో దిగాలంటూ సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు
- ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజాపై ఓడిన కేఎస్ లక్ష్మణరావు
- లక్ష్మణరావు అడిగిన వెంటనే ఫొటోకు సీఎం అవకాశం
- మండలిలో ఛైర్మన్ తమకు సరిగా మైక్ ఇవ్వట్లేదని సీఎం, ఛైర్మన్ సమక్షంలో నారా లోకేష్ సరదా వ్యాఖ్యలు
- పట్టుబట్టి మీరే మైక్ తీసుకోవాలంటూ సీఎం వ్యాఖ్యలు
- ఫొటో సెషన్ ముందు వరుసలో అవకాశం ఉందా అని అడిగిన బొత్స
- మండలి ప్రతిపక్ష నేతగా మీకు ముందు వరుసలో సీటు ఉందని చెప్పిన చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ
- పొరపాటున వేరే కుర్చీలో కూర్చున్న బొత్స
- డిప్యూటీ సీఎం సీటుకు ఇబ్బంది అవుతోందని గమనించి బొత్సని లేపకుండా మరో కుర్చీ ఏర్పాటు వేయించిన మంత్రి నారా లోకేష్