అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో ప్రేమికుల దినోత్సవం నాడు అమానుషం చోటుచేసుకుంది. ప్యారంపల్లెకు చెందిన ఓ యువతిపై పై ఓ యువకుడు యాసిడ్(Acid Attack) పోశాడు.అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు మదనపల్లె అమ్మచెరువు మిట్టకు చెందిన గణేష్ గా పోలీసులు గుర్తించారు.
యువతి తలపై కత్తితో పొడిచి మొహంపై యాసిడ్ పోసినట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సాయంతో కుటుంబీకులు హుటాహుటినా యాసిడ్ దాడిలో గాయపడిన యువతిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.
ప్యారంపల్లెకు చెందిన జనార్ధన్, రెడ్డమ్మ దంపతుల కుమార్తె గౌతమి. ఈ యువతికి ఏప్రిల్ 29న పెళ్లి నిశ్చయం అయిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న గణేష్ తనను ప్రేమించాలని గౌతమి వెంటపడి వేధించేవాడని పోలీసులు తెలిపారు. గౌతమి నిరాకరించటంతో కక్ష పెంచుకున్న గణేష్ ఎవరు లేని సమయంలో గౌతమిపై దాడి చేసి యాసిడ్ ముఖంపై పోసి పరారయ్యాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోనున్నారు పోలీసులు.