Monday, April 7, 2025
HomeAP జిల్లా వార్తలుఅన్నమయ్యMinister Ramprasad: డిప్యూటీ కలెక్టర్‌ రమా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి...

Minister Ramprasad: డిప్యూటీ కలెక్టర్‌ రమా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

పీలేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి మృతి చెందడం చాలా బాధాకరమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రమా మృతదేహాన్ని పరిశీలించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… పీలేరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి సోమవారం పీజిఆర్ఎస్ కార్యక్రమానికి వస్తుండగా సంబేపల్లి మండలం, ఎర్రగుంట్ల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగి మృతి చందనం చాలా బాధాకరమన్నారు.


ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రివర్యులు కోరారు. అనంతరం గాయపడిన వారిని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డిఓ, తహసిల్దార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News