Sunday, July 13, 2025
HomeAP జిల్లా వార్తలుHigh Tension In Tadipatri: ఏడాది తర్వాత సొంత నియోజకవర్గానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి

High Tension In Tadipatri: ఏడాది తర్వాత సొంత నియోజకవర్గానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి

Tadipatri Politics: ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైసీసీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య నడుస్తున్న వార్ పతాకస్థాయికి చేరింది.
గత ఎన్నికల్లో ఓడిపోయి ఏడాది కాలంగా తాడిపత్రి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇవాళ తాడిపత్రిలో ఎంట్రీ ఇవ్వడంతో జేసీ తన అనుచరులతో కలిసి పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరారు. పెద్దారెడ్డి ఒక్కసారిగా తన ఇంట్లో ప్రత్యక్షం కావడంతో ఉలిక్కిపడిన పోలీసులు అతడిని పంపించే ప్రయత్నం చేశారు. తమ ఎస్కార్ట్ ద్వారా పోలీసులు పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పంపించివేశారు.

కాగా, విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరారు. జేసీని పోలీసులు తిరిగి ఆయన ఇంటికి పంపించివేశారు. మరోవైపు జేసీ ఇంటి వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అయితే, 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దారెడ్డి గెలిచినా ఓడినా ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానని చెప్పడంతో దీనిపై జేసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

అయితే మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని కూల్చి వేసేందుకు కూటమి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సమాచారం. జేసీ ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదుతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు మునిసిపల్ అధికారులు కొలతలు తీసుకున్నారు. విషయం తెలుసుకున్న పెద్దారెడ్డి ఆదివారం ఉదయం తాడిపత్రిలోని తన ఇంటికి రాగా పోలీసులు అరెస్ట చేశారు. మరోవైపు పెద్దారెడ్డిపై టీడీపీ నేతలు దాడులు చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు పెద్దారెడ్డిని అరెస్టు చేయగా తనకు తాడిపత్రి వచ్చేందుకు హైకోర్టు అనుమతి ఉందని తెలపడంతో అతన్ని తాడిపత్రి నుంచి అనంతపురంలోని రాంనగర్‌లోఉంటున్న నివాసానికి తరలించారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/jr-ntr-preparing-for-his-next-movie-with-trivikram/

ఈ ఘటనపై పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏడాది కాలంగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నానని పేర్కొన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని జేసీ రాజకీయాలు చేస్తున్నారని పెద్దారెడ్డి మండిపడ్డారు. తన ప్రైవేటు సైన్యంతో జేపీ బెదిరించాలని చూస్తున్నారని, జేసీ ప్రభాకర్‌తో రాజకీయంగా అయినా యుద్ధానికి అయినా తాను సిద్ధమని తెలిపారు. తన ఇంటి నిర్మాణం సక్రమంగానే జరిగిందని, పోలీసులపై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తానని అన్నారు.

ALSO READ: https://teluguprabha.net/ap-district-news/lemon-price-down-sharply-in-andhrapradesh/

2019లో జరిగిన ఎన్నికల్లో కేతిరెడ్డి పెద్దారెడ్డి వైసీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రత్యర్థి జేసీ తనయుడు అస్మిత్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం 2024లో జరిగిన ఎన్నికల్లో అస్మిత్ రెడ్డి పెద్దారెడ్డిపై విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News