బిజెపి సిద్ధాంతాలు ప్రజల్లో తీసుకెళ్ళి బలోపేతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి కోరారు. మంగళవారం జె బి గార్డెన్ లో బిజెపి పార్టీ కార్యకర్తల విస్కృత సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ ఆదోని ప్రజలు బిజెపి పట్ల విశ్వాసం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించారన్నారు.
సమస్యలు తెలుసుకుని
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేస్తూ సమస్యలను తెలుసుకుంటూ పరిష్కార దిశగా అడుగులు వేయాలన్నారు. బిజెపి కార్యకర్త నిజాయితీ, నిబద్ధతతో ఉంటూ ఇతర పార్టీలకు ఆదర్శంగా ఉండాలన్నారు. ప్రతి కార్యకర్త ప్రజా నాయకుడిగా ఎదుగుతూ మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి బాధ్యతలు అందుకోవాలన్నారు. బిజెపి సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, కేంద్రం నుండి నేరుగా క్రింది స్థాయికి చేరుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరు సిద్ధం కావాలన్నారు.