ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలలో అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సి.ఎం.ఆర్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొత్త బ్రాంచ్ ను కర్నూలులో ప్రారంభించింది. సి.ఎం.ఆర్. షాపింగ్ మాల్‌ను పార్క్ రోడ్ లో పాణ్యం శాసనసభ్యులు గౌరు చరితా రెడ్డి ఘనంగా ప్రారంభించారు.
మాల్ వల్ల ఉద్యోగాలు
షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం స్టోరులోని అన్నిరకాల వస్త్రాలను ఆమె పరిశీలించారు. అందరూ మెచ్చేలా, అన్నిరకాల డిజైన్లు చాలా తక్కువ రేట్లకే లభిస్తున్నాయని గౌరు చరిత కొనియాడారు. మన కర్నూలులో సి.ఎం.ఆర్. లాంటి పెద్ద మాల్స్ రావటం వలన మరిన్ని ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు.
ఈ సందర్భంగా సి.ఎం.ఆర్. చైర్మన్ వెంకటరమణకి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య అతిథులుగా సీనియర్ టిడిపి లీడర్ డి. విష్ణువర్ధన్ రెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మొదటి కొనుగోలు చేశారు.
ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతి
సి.ఎం.ఆర్. ఫౌండర్ అండ్ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తమ సంస్థను గత 4 దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలుపుతూ మా 40వ షోరూం కర్నూలులో ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. సి.ఎం.ఆర్.లో షాపింగ్ అంటే ప్రపంచ స్థాయి అనుభూతి కలిగేలా ఉంటుందన్నారు. ప్రజలు తమకు కావాల్సిన అన్నిరకాల వేడుకలకు సి.ఎం.ఆర్. తగు విధంగా అన్ని మోడల్స్ లో కుటుంబమంతటికీ నచ్చే వస్త్రాలు సరసమైన ధరకే అందించటం తమ ప్రత్యేకత అన్నారు.
మార్కెట్లో ఎవ్వరూ ఇవ్వని ధరకే
తమ సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్లో మరెవ్వరూ ఇవ్వని ధరలకు సి.ఎం.ఆర్. అందిస్తుందన్నారు. సి.ఎం.ఆర్. మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ సి.ఎం.ఆర్. అంటే ది వన్ స్టాప్ షాప్ అన్నారు. ఫ్యామిలీ అందరికీ నచ్చేలా అన్ని రకాల వెరైటీలు, డిజైన్స్ లభిస్తాయన్నారు. తమవద్ద అందరికీ అందుబాటు ధరలలో లక్షల్లో డిజైన్లు, వేలల్లో వెరైటీలు లభిస్తాయన్నారు. ప్రస్తుత యువతరానికి నచ్చేవిధంగా అన్నిరకాల వెరైటీలు లభిస్తాయన్నారు.
డ్యాన్సులు, సెల్ఫీలు కూడా
ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీతారలు ప్రముఖ సినీతారలు సంయుక్త మీనన్, మీనాక్షి చౌదరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంయుక్త, మీనాక్షిలు మాల్ లోని అన్ని సెక్షన్లు కలియతిరిగి అన్ని రకాల వస్త్రాలను పరిశీలించి, కలెక్షన్, క్వాలిటీ చాలా బాగుందన్నారు. అభిమానులతో సెల్ఫీలు దిగి తమ డ్యాన్సుతో ఫ్యాన్సును ఉర్రూతలూగించారు.