Thursday, December 12, 2024
HomeAP జిల్లా వార్తలుకర్నూలుGonegandla: డీజే పెట్టాలా? అయితే..

Gonegandla: డీజే పెట్టాలా? అయితే..

డీజేల పర్మిషన్స్..

పెళ్లి వేడుకలు సందర్భంగా డీజేలు ఏర్పాటు చేయాలంటే డిఎస్పి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని స్థానిక సిఐ గంగాధర్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన గోనెగండ్లలోని స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ గంగాధర్ మాట్లాడుతూ మండలంలో పెళ్లిళ్లకు మరియు తదితర వేడుకలకు డీజేలు పెట్టకూడదని అన్నారు.

- Advertisement -

వేడుకల్లో డీజేలు పెట్టుకోవాలంటే తక్కువ శబ్దం ఇచ్చే మైక్, డెక్కులకు అనుమతి ఉంటుందని, అది కూడా డీ ఎస్ పి ద్వారా అనుమతి తీసుకొని పెట్టుకోవాలన్నారు. డీజే శబ్దం 70 డెసిబుల్స్ వరకు అనుమతి ఉండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఇస్తామని, పోలీస్ శాఖ వారి అనుమతి లేకుండా ఏ రకమైన డీజేలు ఏర్పాటు చేసిన కేసులు నమోదు చేయబడునని తెలిపారు.
డీజేల చప్పుడు ఎక్కువైతే నష్టాలే తప్ప లాభాలు లేవని, డీజేల అధిక శబ్దాల వల్ల గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ , వినికిడి శక్తి కోల్పోవడం, చెవిలో శబ్దాలు రావడం, కర్ణభేరి దెబ్బతినడం, అధిక రక్తపోటు, ఒత్తిడి, నిద్రలేమి, మానసిక ఆందోళన, గుండె దడ, మహిళల్లో గర్భవిచ్ఛిత్తి, గర్భంలోని శిశువుకు భవిష్యత్తులో వినికిడి లోపం వంటి సమస్యలు తలెత్తుతాయని వివరించారు. కావున డీజేలు పెట్టుకుంటే కలిగే నష్టాలపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని గోనెగండ్ల ఇన్స్పెక్టర్ ఎ. గంగాధర్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News