కొలిమిగుండ్ల మండలం గొరిమాని పల్లి గ్రామంలో 50 మంది శివ దీక్ష చేపట్టిన శివ స్వాములు ఇరుముడి ధరించి ప్రముఖ శివ క్షేత్రమైన శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. గ్రామంలో 50 మంది శివ భక్తులు శివ దీక్ష స్వీకరించి భక్తిశ్రద్ధలతో మండలం రోజులు శివాలయంలో పూజలు నిర్వహించారు. శనివారం స్థానిక శివాలయంలో శివ స్వాములందరూ ఇరుముడి ధరించి గ్రామంలో ఊరేగింపుగా తిరిగి శ్రీశైలం బయలుదేరి వెళ్లారని పురోహితులు ఆలూరి రాఘవేంద్ర ప్రసాద్ స్వామి తెలిపారు.