Saturday, March 15, 2025
HomeAP జిల్లా వార్తలుకర్నూలుKrishnagiri: ప్రతి గ్రామంలో సైబర్ క్రైమ్ పై అవగాహన

Krishnagiri: ప్రతి గ్రామంలో సైబర్ క్రైమ్ పై అవగాహన

విద్యార్థులకు..

క్రిష్ణగిరి మండల ఎస్సై మల్లికార్జున ప్రతి గ్రామంలో సంచరిస్తూ, గ్రామాలలో ఎక్కడ కూడా అరాచకాలకు మద్యానికి బానిసలవ్వకుండా ప్రతి గ్రామంలో శాంతిభద్రత మెలగాలని సూచిస్తూ దినముందు ఎరుకల చెరువు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ నందు పర్యటన చేసి విద్యార్థులతో విద్యార్థినీలతో టీచర్స్ తో సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తూ విద్యార్థులు ఉపాధ్యాయుల పట్ల ఏవిధంగా మెలగాలి ఏ విధంగా ఉండాలి మంచి ఆలోచనలతో ఉంటూ విద్య విషయాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లాలని సూచిస్తూ వివిధ రకాల క్రైమ్ సంబంధించిన విషయాలపై అవగాహన కల్పిస్తూ వారితో మమే కమై ఫ్రెండ్లీ పోలీసింగ్ చేశారు.

- Advertisement -

టీచర్లతో కలసి విద్యార్థులకు సైబర్ క్రైమ్ పాంప్లేట్స్ పంచి, టోల్ ఫ్రీ నెంబర్, గోల్డెన్ అవర్ గురించి అలాగే ప్రోహిబిషన్ ఆఫ్ ర్యాగింగ్ యాక్ట్, పోక్సో చట్టం, బాల్య వివాహాలు, రోడ్డు ప్రమాదాలు, డ్రగ్స్ వద్దు బ్రో, సోషల్ మీడియా పర్యవసనాల గురించి అవగాహన కల్పిస్తూ విద్యార్థులు గురువుల పట్ల అవలంబించవలసిన విధానం గురించి తెలియపరచారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News