Thursday, January 2, 2025
HomeAP జిల్లా వార్తలుకర్నూలుKurnool: కలెక్టర్ 'మధ్యహ్న భోజనం'

Kurnool: కలెక్టర్ ‘మధ్యహ్న భోజనం’

సామాన్యులతో కలిసి

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఓంకారం కాశిరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదుదారులకు మధ్యాహ్నం భోజనాన్ని పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ రాజకుమారి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ ప్రాంగణంలో ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను విన్నవిస్తుంటారని, ఫిర్యాదుదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పి జి ఆర్ ఎస్ ప్రాంగణంలో షెడ్ వేయించడంతోపాటు ప్రశాంతంగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు.

ఇందులో భాగంగానే చల్లటి మంచినీళ్లతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఓంకారం కాశిరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో అర్జీదారులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 2023 మే నుండి ఆహారం పంపిణీ చేస్తున్న కార్యక్రమానికి కాశిరెడ్డి నాయన ఆశ్రమం వారు గత రెండు నెలల నుండి సహకరిస్తున్నారన్నారు. నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు ఫిర్యాదుదారులకు అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ, కాశిరెడ్డి అనే ఆశ్రమ నిర్వాహకులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి సోమవారం 350 మంది అర్జీదారులు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరి పర్ల తెలిపారు. ఓంకార క్షేత్రం కాశిరెడ్డి నాయన ఆశ్రమం వారి సహకారంతో మరింత ఎక్కువమంది అర్జీదారులకు నాణ్యతతో 7, 8 రకాల ఆహార పదార్థాలతో భోజనాన్ని అందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని అర్జీదారులకు ఆహార పదార్థాలు వడ్డించడంతోపాటు వారితో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి డిస్టిక్ కోపరేటివ్ ఆఫీసర్ వెంకటసుబ్బయ్య, డీఈఓ జనార్దన్ రెడ్డి, డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతామణి, రెడ్ క్రాస్ ట్రెజరర్ నాగేశ్వరరావు కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News