రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆచార్య వి. వెంకట బసవరావును నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ గా పనిచేసి ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తూ గత జులై 31న పదవీ విరమణ పొందారు.
ప్రస్తుత వీసీపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో
రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆయనను రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఇన్చార్జి వీసీగా పనిచేస్తున్నఎన్ టి కె నాయక్ పై అనేక అవినీతి ఆరోపణల నేపథ్యంలో యూనివర్సిటీని ప్రక్షాళన చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం దృష్టి సారించి బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని వైస్ ఛాన్సలర్ గా నియమించడంతో యూనివర్సిటీలోని పలు బీసీ ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గు తేల్చాలని పలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.