నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి శ్రీశైల పాదయాత్రలో భాగంగా ఆదివారం ఆత్మకూరు పట్టణానికి చేరుకున్నారు. అక్కడ నుంచి వెంకటాపురం గ్రామంలోని శివాలయం, బైర్లూటి ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. మూర్తుజావల్లి దర్గాలో ప్రార్థనలు చేశారు. అనంతరం కాలినడకన శ్రీశైల మల్లన్న సన్నిధికి బయలుదేరారు. నంద్యాల ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారి బైరెడ్డి శబరి పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికీ ఐదు సార్లు శ్రీశైలానికి ఆడవి మార్గంలో పాదయాత్ర చేసినట్లు ఎంపీ బైరెడ్డి శబరి వెల్లడించారు. ఎంపీ వెంట అభిమానులు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు తరలివెళ్లారు.
