కొత్తపల్లి మండల పరిధిలోని సప్తనది సంగమ తీరాన వెలసిన సంగమేశ్వర క్షేత్ర ఆలయ శిఖరం కృష్ణమ్మ ఒడి నుంచి బయటపడుతోంది. శ్రీశైలం జలాశయంలో రోజు రోజుకు నీటి నిల్వలు తగ్గుతుండటంతో బుధవారానికి 861 అడుగులకు చేరడంతో ఆలయ శిఖరం 4 అడుగుల మేర బయటపడిందని ఆలయ అర్చకులు తెలకపల్లి రఘురామ శర్మ తెలిపారు. బయటపడుతున్న ఆలయ శిఖరానికి ఇరు రాష్ట్రాల భక్తులు మరబోట్ల ద్వారా దర్శించుకుని పూజలు నిర్వహించారు.