శ్రీశైల క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి , శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి ప్రభుత్వం తరఫున శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ శ్రీశైలం దేవస్థానానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. భక్తుల భద్రత, సౌకర్యాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుంది. బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంది అని తెలిపారు.

రోజు వేలాది మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటున్నారు ఎక్కడ ఎవరికి కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్త లు తీసుకున్నాము. భక్తులు స్వామి వారిని ప్రశాంతంగా దర్శించుకునేదుకు అన్ని ఏర్పాట్లు చేశాము అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ చంద్రశేఖర్ అజాద్ ఆలయ ఈవో శ్రీనివాసరావు , అర్చకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
