Monday, July 14, 2025
HomeAP జిల్లా వార్తలుLemon Price: నిమ్మ ధరలు ఢమాల్.. ఆందోళనలో అన్నదాతలు

Lemon Price: నిమ్మ ధరలు ఢమాల్.. ఆందోళనలో అన్నదాతలు


Lemon Price:
కోటి ఆశలతో రైతులు సాగుచేసిన నిమ్మ తోటలు ఇప్పుడు వారికి నిరాశను మిగిల్చాయి. ప్రస్తుతం నిమ్మ ధరలు భారీగా పడిపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది లాభాలు చూసిన తమకు ఈసారి ధరలు పతనం కావడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. కాగా, గతేడాది కేజీ రూ.100 ఉండగా ఇప్పుడు రూ.15 నుంచి 20 రూపాయలు మాత్రమే పరిమితమైంది.


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా కనిగిరి నిమ్మ తోటలకు ప్రసిద్ధి చెందినది. ఏలూరు జిల్లాలో సైతం రైతులు వేల ఎకరాల్లో నిమ్మ సాగు చేస్తున్నారు. కనిగిరిలో సుమారు 2,500 హెక్టార్లలో నిమ్మతోటలు సాగు చేశారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, ముంబై, కలకత్తా, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. కర్ణాటక, మహారాష్ర్టలో నిమ్మ దిగుబడి అధికంగా రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో కేజీ నిమ్మకాయలు 15 రూపాయలు కూడా పలకడం లేదు.

ALSO READ: https://teluguprabha.net/national-news/indias-first-mobile-e-voting-in-bihar/

గతేడాది రైతులకు నిమ్మ పంట కాసుల వర్షం కురిపించింది. ఎన్నడూ లేనంతగా ధరలు ఉండడంతో అన్నదాతలు లాభాలను చూశారు. పోయిన ఏడాది మాదిరగానే ధరలు ఉంటాయని రైతన్నలు ఆసారి కూడా నిమ్మ సాగు వైపు మొగ్గు చూపారు. అధిక మొత్తంలో కౌలు చెల్లించి సాగు చేపట్టారు. కానీ, ఒక్కసారిగా నిమ్మ ధరలు పడిపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు లేక కూలీ డబ్బులు చెల్లించి మార్కెట్‌కు తరలించలేక చెట్ల మీదనే వదిలేస్తున్నారు. మరోవైపు మార్కెట్‌కు దిగుబడి తీసుకెళ్లిన కొందరు రైతులు ధరలు గిట్టుబాటు కాక రోడ్ల పక్కనే పడేస్తున్నారు. ఆసారి పెట్టుబడి కూడా రాదని అన్నదాతలు కన్నీరుమున్నీరు అవుతున్నారు. మార్కెట్లలో వ్యాపారులు, దళారులు కుమ్మక్కై కృత్రిమంగా ధరలు తగ్గిస్తున్నారని ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/minister-adluri-laxman-car-accident/

రాయలసీమ జిల్లాల్లో సైతం రైతులు వేల ఎకరాల్లో నిమ్మ తోటలు సాగు చేశారు. కడప, అనంతపురం, కర్నూల్ జిల్లాల్లో నిమ్మ సాగు అధికంగా చేపట్టారు. కడప జిల్లాల్లోని వేంపల్లి, పులివెందుల, రాయచోటి, వేముల, అనంతపురంలోని రాయలచెరువు, తాడిపత్రి, కర్నూలు జిల్లాలోని డోన్, బేతంచెర్ల తదితర ప్రాంతాల్లో నిమ్మ తోటలను రైతులు సాగు చేస్తున్నారు. గత ఏడాది బస్తా రెండు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పలికిన ధరలు నేడు భారీగా పతనం అయ్యాయి. దీంతో రైతులు తాము పెట్టిన పెట్టుబడి కూడా రాదని వాపోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News