Tirumala Fire Accident: పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీగోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ఆలయ సమీప గోపురం ముందున్న షాపులకు మంటలు అంటుకోవడంతో స్థానికులతోపాటు భక్తులు కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్నికీలలకు రెండు షాపులు దగ్ధమయ్యాయి. ఈ క్రమంలో ఆలయం ముందున్న చలువ పందిళ్లకు కూడా మంటలు వ్యాపించి అవి కూడా ఆగ్నికి అహుతయ్యాయి.
గురువారం (జూలై 03) తెల్లవారుజామున ఈ ఘోర ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈలోపే జరగకూడని నష్టం జరిగిపోయింది. షాపులో ఉన్న సామాగ్రి మెుత్తం కాలిపోయింది. ప్రమాద సమయంలో భక్తులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.