HomeAP జిల్లా వార్తలుSri Krishnashtami: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి.. వేడుకల్లో ఎమ్మెల్యే వరద

Sri Krishnashtami: ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి.. వేడుకల్లో ఎమ్మెల్యే వరద

ప్రొద్దుటూరు (తెలుగు ప్రభ): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రొద్దుటూరులోని శ్రీకృష్ణాలయంలో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

- Advertisement -

ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆలయానికి చేరుకుని శ్రీకృష్ణుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆలయ నిర్వాహకులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, బాలసుబ్బరాయుడుతో పాటు పలువురు ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డిని, ఇతర ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. 

krishnashtami mla

అనంతరం కృష్ణాష్టమి వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News