Tuesday, February 25, 2025
HomeAP జిల్లా వార్తలునంద్యాలమంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా లడ్డు ప్రసాదం పంపిణీ

మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా లడ్డు ప్రసాదం పంపిణీ

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో.. వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సొంత నిధులతో మూడు రోజులపాటు దేవస్థానానికి వచ్చే భక్తులకు ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని అందజేస్తున్నారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరా రెడ్డి లడ్డు ప్రసాదాన్ని స్వయంగా తయారు చేయించారు.

- Advertisement -

ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగా భక్తులకు బీసీ ఇందిరా రెడ్డి ఉచిత లడ్డు పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బీసీ ఇందిరా రెడ్డి మాట్లాడుతూ యాగంటి క్షేత్రంలో లడ్డు ప్రసాదాన్ని భక్తులకు మూడు రోజులపాటు ఉచితంగా అందజేయడం ఆనందంగా ఉందని తెలిపారు. అంతేకాకుండా మూడు రోజులపాటు వాహనాలకు టోల్ ఛార్జీలు కూడా ఉండవని తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు వినియోగించుకోవాలని పేర్కొన్నారు.

అలాగే ప్రతి ఒక్కరూ బనగానపల్లె పట్టణమే కాకుండా అన్ని గ్రామాల్లో ప్లాస్టిక్ నిర్మూలనకు సహకరించాలని, యాగంటి క్షేత్రంలో కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగుటూరి శ్రీనియ్య, బత్తుల భాస్కర్ రెడ్డి, బండి హర్షవర్ధన్ రెడ్డి, బొబ్బల మదన్ భూపాల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News