Tuesday, February 25, 2025
HomeAP జిల్లా వార్తలునంద్యాలశ్రీశైలంలో వైభవంగా.. స్వామి అమ్మవార్ల గజవాహన సేవ

శ్రీశైలంలో వైభవంగా.. స్వామి అమ్మవార్ల గజవాహన సేవ

శ్రీశైల క్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం వైభవంగా స్వామి అమ్మవార్ల గజవాహన సేవను నిర్వహించారు. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. బుధవారం జరగనున్న పాగాలంకరణ కార్యక్రమానికి విశేషంగా భక్తులు హాజరవుతారని ఆలయ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇటీవల ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానుండటంతో భారీ భద్రత సైతం ఏర్పాటు చేశారు.
పాగాలంకరణలో రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు, భక్తులు, ప్రజలు రానున్న సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని.. భక్తులు కూర్చునే ప్రదేశాలను, భక్తులు వచ్చి పోయే ప్రదేశాల్లో ఎలాంటి తొక్కిసలాటకు.. అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇటీవల తిరుపతి బ్రహ్మోత్సవాల సమయంలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. శ్రీశైల క్షేత్రానికి విశేషంగా భక్తులు హాజరవు తుంటారు.. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను నంద్యాల జిల్లా ఇంచార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల గజవాహన సేవలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News