దక్షిణ భారతదేశంలోని ప్రజలను ఆకట్టుకున్న ఆర్.ఎస్. బ్రదర్స్ శుక్రవారం (18.04.2025)న విజయవాడలో తమ రెండవ షోరూమ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో లోక్‌సభ సభ్యులు కేశినేని చిన్ని, అసెంబ్లీ సభ్యులు బొండా ఉమామహేశ్వర రావు, కార్పొరేటర్ నెల్లిబండ్ల బాలాస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటి కీర్తి సురేష్ జ్యోతి ప్రజ్వలనతో షోరూమ్ ప్రారంభించారు.

ఈ కొత్త షోరూమ్ పెళ్లిళ్ల కోసము ప్రత్యేకంగా రూపొందించిన కొత్త కలెక్షన్లను అందుబాటులో ఉంచింది. ఇందులో మహిళలకోసం కంచిపట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, లెహంగాలు, పురుషులకోసం షెర్వాణీలు, కుర్తాలు, పిల్లలకోసం కిడ్స్‌వేర్ వంటి ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధరలు కేవలం రూ.150 నుంచి ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు.

ఆర్.ఎస్. బ్రదర్స్ డైరెక్టర్లు పి.వెంకటేశ్వర్లు, ఎస్.రాజమౌళి, టి.ప్రసాదరావు ఆంధ్రప్రదేశ్‌లో తమ బ్రాండ్ వేగంగా విస్తరిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేశారు. సాంస్కృతిక విలువలు కలగలిసిన నాణ్యమైన దుస్తులను అందించడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు.

ఈ ప్రారంభోత్సవం ద్వారా ఆర్.ఎస్. బ్రదర్స్ తమ కస్టమర్లతో బంధాన్ని మరింత బలపరుస్తోంది. షోరూమ్‌లో నాలుగు లక్షలకుపైగా వైవిధ్యభరితమైన మోడల్స్ అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. పెళ్లి వేడుకలు, పండుగలకై ప్రత్యేక కలెక్షన్లు, పాశ్చాత్య వస్త్రాలు, బ్రాండెడ్ మెన్స్‌వేర్ వంటి ఎన్నో ప్రత్యేక ఉత్పత్తులు విజయవాడలోని బీసెంట్ రోడ్ క్రాస్, ఏలూరు రోడ్‌లోని షోరూమ్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.