పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో వైకాపా సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు దివంగత పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి(ys jagan) పరామర్శించారు. అనంతరం స్వర్గీయ పాలవలస రాజశేఖరం ఇంటిలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
ఇటీవల అనారోగ్యంలో చికిత్స పొందుతూ మరణించిన వైకాపా సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు దివంగత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని వైకాపా అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ పరామర్శించారు. మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖపట్నం నుంచి పాలకొండ చేరుకున్న జగన్ కు ఆ పార్టీ నేతలు, ప్రజలు, కార్యకర్తలు స్వాగతం పలికారు.
రాజాం జంక్షన్, కోట దుర్గ జంక్షన్ గుడి, ఆర్టీసీ కాంప్లెక్ మీదుగా పాలవలస రాజశేఖరం ఇంటికి చేరుకున్న వైయస్ జగన్ దివంగత రాజశేఖరం చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రాజశేఖరం సతీమణి పాలవలస ఇందుమతి, కుమార్తె మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, కుమారుడు ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు.