Monday, July 14, 2025
HomeAP జిల్లా వార్తలుElephant attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో 5 మంది మృతి..

Elephant attack: అన్నమయ్య జిల్లాలో ఏనుగుల దాడిలో 5 మంది మృతి..

అన్నమయ్య జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భక్తులపై ఏనుగులు గుంపు (Elephant attack)దాడి చేసింది. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వీరంతా రైల్వే కోడూరు మండలం ఉర్లగట్ట పోడుగు చెందిన ఎస్టీలుగా గుర్తించారు.

- Advertisement -

ఓబులవారిపల్లి మండలం వైకోట అడవుల్లోని గుండాలకోనకు కాలినడకన వెళుతుండగా అర్ధరాత్రి ఘటన జరిగింది. బుధవారం శివరాత్రి సందర్భంగా ఉర్లగట్టపోడు ఎస్టీలు యానాదులు శివాలయానికి వెళుతున్న సందర్భంలో ఇద్దరు మహిళలు ఒక పురుషుడు దుర్మరణం చెందారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సంఘటన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

దాడి ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా
శివరాత్రికి వై కోట సమీపం గుండాల కోనలో ఉన్న ఈశ్వరుడు దర్శనానికి బయలుదేరిన శివయ్య భక్తులు ఏనుగుల దాడిలో మృతి చెందటంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలన్నారు. ఘటనకు సంబంధించి వివరాలను అధికారులకు ఫోన్ చేసి కనుక్కున్నారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మృతుల కుటుంబాలకి రూ.10 లక్షలు, క్షతగాత్రులకి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.

అన్నమయ్య జిల్లాలో భక్తులపై ఏనుగుల దాడి ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆరా తీశారు. ఘటనపై వివరాలు ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి. శివ భక్తుల ఐదుగురు మృతి చెందడం పట్ల మంత్రి ఆనం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News