Monday, February 3, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుపతిTirupathi venkanna: తిరుమల వెంకన్నకు అరుదైన విరాళం

Tirupathi venkanna: తిరుమల వెంకన్నకు అరుదైన విరాళం

తిరుమల(tirumala) ఆధ్మాత్మిక క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఇందులో భాగంగా వెంకన్నను దర్శించుకుని తమ మెుక్కులను కానుకల రూపంలో చెల్లించుకుంటూ ఉంటారు. కొంత మంది తమ కానుకలను చెల్లించుకుని తమ భక్తిని చాటుకుంటూ ఉంటారు. ఇలానే ఓ మహిళ తిరుమల వెంకన్న స్వామికి కానుకగా ఆదా చేసిన ప్రతి పైసాను ఎస్వీ సర్వ శ్రేయాస్ ట్రస్ట్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చి తన భక్తిని చాటుకున్నారు.

నేడు శ్రీవారికి ఈ మహిళ అందించిన విరాళం చాలా అరుదైనదిగా నిలిచిపోయింది. మన దేశంతో పాటుగా పలు దేశాల్లో విపత్తు అధికారిగా సేవలు అందించిన ఈ మహిళ పేరు సి. మోహన. రేణిగుంటకు చెందిన ఈమె భారతదేశంతో పాటు కాసావో, అల్బేనియా, యెమెన్, సౌదీ అరేబియాలలో అభివృద్ధి – విపత్తు నిర్వహణ రంగాలలో వివిధ హోదాల్లో పనిచేశారు. తన ఉద్యోగ జీవితంలో సేవ్ చేసిన ప్రతి రూపాయిని తిరుపతి వెంకన్న సాక్షిగా కానుకగా సమర్పించారు.


మూడున్నర దశాబ్దాలకు పైగా తన ఉద్యోగ జీవితంలో సంపాదించిన డబ్బును శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో అనాథలు, పేదలకు ఉపయోగపడాలనే మోహన నిర్ణయం చాలా ప్రశంసనీయమని అన్నారు. ఉద్యోగ జీవితంలో ఆదా చేసిన రూ.50 లక్షలను టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర సర్వ శ్రేయాస్(ఎస్వీ బాలమందిర్) ట్రస్ట్‌కు ఇచ్చారు. ఆ మొత్తాన్ని డీడీ రూపంలో తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అప్పగించారు. ఆమె దాతృత్వాన్ని వెంకయ్య చౌదరి కొనియాడారు.

- Advertisement -

ఎస్వీ బాల మందిర్ విద్యా సంస్థల్లో చదువుతున్న పిల్లల సంక్షేమం కోసం ఈ విరాళాన్ని వినియోగించనున్నారు. ఉద్యోగ రీత్యా ఆమె ఎక్కడ పనిచేస్తున్నా, గోవిందుని నామస్మరణను మాత్రం మర్చిపోలేదు. అంతేకాదు తన వృత్తిజీవితంలో ఆదా చేసిన ప్రతి రూపాయిని శ్రీ వారికి కానుకగా ఇవ్వాలని నిర్ణయించటం గొప్ప విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News