తిరుపతిలోని అన్నమయ్య భవనంలో జరిగిన తితిదే ధర్మకర్తల మండలి సమావేశం(Board of Trustees Meeting) తీర్మానాలు ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు వివరించారు. రూ.5258.68 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపామన్నారు. రాష్ట్రాల రాజధానుల్లో ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఇతర దేశాల్లోనూ శ్రీవారి ఆలయాలు నిర్మించాలని ట్రస్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. త్వరలో వీఐపీ బ్రేక్ దర్శన వేళల్లో మార్పులు ఉంటాయని చెప్పారు. శ్రీవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
సైన్స్ సిటీకి కేటాయించిన 20ఎకరాలు తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు. తిరుమలలో అనధికార హాకర్లపై చర్యలకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆగమ సలహా మండలిపై టీటీడీ వేటు వేస్తుందని చెప్పారు. రూ.26 కోట్లతో 1,500 గదులకు మరమ్మతులు చేపడతామని చెప్పారు. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
జూ పార్క్ నుంచి కపిలతీర్థం వరకు ప్రైవేటు నిర్మాణాలు లేకుండా తీర్మానం తీసుకున్నామని తెలిపారు. తితిదేలోని శాశ్వత ఉద్యోగులకు 3 నెలలకు ఒకసారి సుపథం టికెట్లు ఇచ్చి స్వామివారి దర్శనం కేటాయింపు చేస్తామని చెప్పారు. తిరుమలలో లైసెన్స్ లేని దుకాణాలు ఖాళీ చేయిస్తామని తెలిపారు.