ఏడుకొండల వారు కొలువై ఉన్న దివ్యక్షేత్రం తిరుమల(Tirumala). నిత్యం వేలాది మంది భక్తులు వెంకన్నను దర్శించుకుని మెుక్కులు చెల్లించుకుని స్వామి వారి దీవెనలు పొందుతుంటారు. అయితే శ్రీవారి ఆలయంలో సంయమనం పాటించాల్సిన ఉద్యోగి, పాలక మండలి సభ్యుల మధ్య వివాదం నడిచింది. దీంతో భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
అసలేమీ జరిగిందంటే..
శ్రీవారి ఆలయ మహా ద్వారం ముందు టీటీడీ ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నారు. శ్రీ వారి దర్శనం అనంతరం ఆలయ మహా ద్వారం వద్దకు వచ్చిన పాలకమండలి సభ్యులు నరేష్ కుమార్ మహా ద్వారం వద్ద గేటు తీయాలని కోరారు.
ఆఫ్ట్రాల్ ఉద్యోగివి
అందుకు ఉద్యోగి నిరాకరించడంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. పాలకమండలి సభ్యునిగా ఉండి నేను చెప్తే గేటు తీయవా అంటూ రెచ్చిపోయాడు. టీటీడీ ఉద్యోగిపై బూతు పురాణాల దండకం చదివాడు. ఓ చిన్న ఉద్యోగివి నన్ను అడ్డుకొనే ధైర్యం ఎవరిచ్చారని గట్టిగా నిలదీశారు.
చివరకు సర్దుమనిగిన గొడవ
ఈవో, అడిషనల్ ఈవో ఆదేశాల మేరకు ఎవరికి మహా ద్వారం గెట్ ద్వారా పంపడం లేదని మీరేమైనా అడగాలంటే వారినే అడగాలని సూచించారు. చివరకు విజిలెన్స్ వీజీఓ సురేంద్ర చొరవతో వివాదం సర్దు మనిగింది.