నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి ఇంట పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, నల్లారి అభిమానుల సందడి ఊపందుకుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుండి కలికిరి నగిరిపల్లికి చేరుకున్నారు.
పూలమాలలు, బొకేలు, శాలువాలు, వందల కిలోల కేకులఫై తమ కుటుంబ సభ్యుల చిత్రాలు ముద్రించి, కేక్ కట్ చేస్తూ, బాణ సంచాలు పేల్చి, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో ఉన్నతమైన పదవులు చేపట్టాలని, వారి కుటుంబ సభ్యులపై తమకున్న అనుబంధాన్ని అభిమానాన్ని చాటుకొని ఊరకలెత్తిన ఉత్సాహంతో, నిండు మనసుతో నినాదాలు చేస్తూ ఘనంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అభిమానుల పట్ల కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి అభిమాని, కార్యకర్తల కుటుంబంలో కొత్త సంవత్సరంలో మీరు నమ్ముకున్న లక్ష్యాలు నెరవేరాలని, సరికొత్త ఆశలు, ఉన్నతమైన ఆశయాలు ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలతో వెలుగులు నింపాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.
ప్రజలు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడుపుతూ వ్యవస్థల్ని గాడిలో పెడుతూ ముందుకు తీసుకెళుతున్నారని ఆయన అన్నారు.
పీలేరు నియోజకవర్గమే కాకుండా మదనపల్లి, తంబళ్ళ పల్లి, పుంగనూరు, రాయచోటి, రాజంపేట ప్రధాన నగరాల నలుమూలల నుండి కూటమి శ్రేణులు అభిమానులు అనుబంధ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, మహిళలు అందరూ ఎమ్మెల్యే స్వగ్రామం నగిరిపల్లికి చేరుకుని నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.