తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో ( Fake Ghee case) సీబీఐ సిట్ మరో అడుగు ముందుకు వేసింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో సబ్ జైలు నుంచి నలుగురు నిందితులను తీసుకెళ్ళి సిట్ కు అప్పగించారు పోలీసులు. ఈ మేరకు వీరికి రుయా ఆసుపత్రిలో శుక్రవారం వైద్య పరీక్షలు పూర్తి చేశారు.
ఈనెల 18వ తేదీ వరకు సిట్ అదుపులోనే నిందితులు ఉండనున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక సమర్పించనుంది. నలుగురు నిందితులను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తూ గురువారం రాత్రి తిరుపతి మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేసింది.
అలిపిరి సమీపంలోని సిట్ కార్యాలయంలో శుక్రవారం నుంచి 18 వ తేదీ వరకు విచారణ కొనసాగుతుంది. నిందితులను విచారించి పూర్తి స్థాయి నివేదికను సుప్రీంకోర్టుకు సిబిఐ నేతృత్వంలోని సిట్ అందించనుంది. కస్టడీలో పలు అంశాలపై వివరాలను రాబట్టనున్నారు సిట్ అధికారులు.