తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. తాను బాధ్యతలు తప్పించుకోవడం లేదని.. పూర్తి బాధ్యత తీసుకుంటున్నాని తెలిపారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ముందుగా తొక్కిసలాట కారణంగా ఆరుగురు మృతి చెందిన ఘటనపై పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పారు. భక్తులను ఒక్కసారిగా క్యూలైన్లలోకి అనవసరంగా ఎలా వదిలారంటూ విమర్శించారు. ఇక మనుషులు ప్రాణాలు కోల్పోతున్నా బాధ్యత వహించరా అంటూ ప్రశ్నించారు.
వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్ల నిర్వహణలో ఈవో శ్యామలరావు, జేఈవో వెంకయ్య చౌదరి విఫలమయ్యారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. తొక్కిసలాట జరిగినప్పుడు జనాలను సమర్ధంగా నిర్వహించలేకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుందని అన్నారు. ఏది ఏమైనా తప్పు జరిగిందని.. అందుకు క్షమించాలని తెలిపారు. అయితే ఇంతమంది అధికారులు ఉన్నా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.
ఈ దుర్ఘటనతో రాష్ట్రంలో భక్తుల రక్షణ, సౌకర్యాలపై అనేక ప్రశ్నలు ఉత్భవిస్తున్నాయని తెలిపారు. ఆనందంగా పండుగలు చేసుకోవాల్సిన సమయమిది. అలాంటిది జరిగిన ఘటన దురదృష్టకరం. ఎంతో నమ్మకంతో భక్తులు తిరుపతికి వచ్చారు.. కానీ భక్తులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. గాయపడిన వారిని స్విమ్స్ లో పరామర్శించానని అన్నారు. ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టది లేదని తెలిపారు. వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.
ఇక తొక్కిసలాట బాధితులను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ స్విమ్స్ ఆసుపత్రులకు వెళ్లిన సమయంలో ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ ఘటనపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంతటి పెద్ద దుర్ఘటన జరిగినా, మీరు బాధ్యతగా ఉండలేరా.. అంటూ అభిమానులను మందలించారు.