మే నెలకు సంబంధించి శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ మంగళవారం ఆన్లైన్లో విడుదల చేయనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ, పాద పద్మారాధన సేవలకు సంబంధించి నేటి నుంచి ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో భక్తులు రిజిస్టర్ చేసుకోవచ్చు.
వాటి చెల్లింపుల్ని ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్యలో చేయాల్సి ఉంటుంది. మే నెల గదుల కోటాను టీటీడీ ఈ నెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది.
నిన్న 17-02-2025 రోజున స్వామివారిని 60,784 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 25,521 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి హుండి ఆదాయం 3.29 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.
ఉచిత సర్వదర్శనానికి 20 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పట్టింది. టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం పట్టింది. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పట్టింది.