Saturday, December 28, 2024
HomeAP జిల్లా వార్తలుతిరుపతిSrikalahasthi: లక్షకు 1500లు ఇస్తే..

Srikalahasthi: లక్షకు 1500లు ఇస్తే..

కమీషన్ పంప్

పెట్రోల్ బంక్ అంటే పెట్రోల్ డీజిల్ మాత్రమే అమ్ముతారు అనుకుంటున్నారా? సింపుల్ గా పెట్రోల్ మాత్రమే అమ్మితే కాళహస్తిలోని ఈ పెట్రోల్ పంప్ ఎందుకు ఫేమస్ అవుతుంది?

- Advertisement -

పెట్రోల్ బంక్ లో నిత్యం రాత్రింబవళ్లు పెట్రోల్ డీజిల్, సీఎన్జీ గ్యాస్ ఫిల్లింగ్, ఇంజిన్ ఆయిల్, పంక్చర్స్, సర్వీసింగ్ వంటి వ్యాపారాలు జరుగుతాయి. కానీ ఈ పంపులో మాత్రం ప్రతిరోజూ లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతుంటుంది.

కమీషన్ వ్యాపారం

అయితే ఇక్కడ జోరుగా మనీ ట్రాన్సాక్షన్స్ కు తెరలేపారు. లక్షకి 1500 రూపాయల నుంచి 2500 రూపాయలు కమీషన్ తీసుకుంటూ స్పాట్లో డబ్బులు ఇవ్వడం నిరంతర ప్రక్రియగా మారిపోయింది. మీకు అత్యవసరంగా డబ్బులు అధిక మొత్తంలో కావాలంటే ముందుగానే ఫోన్ ద్వారా రిజర్వ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. మీకు ఒక రోజులో డబ్బులు కావాలంటే ఒక కమీషన్ లేదంటే ఇంకొక కమిషన్ తీసుకుంటూ మనీ ట్రాన్సాక్షన్స్ బ్యాంకులు ఏటీఎంల కంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేస్తున్న పెట్రోల్ బంక్ గా లోకల్ గా పాపులర్ అయింది.

పంపు యజమానికి తెలుసా?

ఒక్కో పెట్రోల్ బంక్ నుండి ప్రతి దినం లక్షల రూపాయలు లావాదేవీలను కొనసాగిస్తూ వేల రూపాయల్లో ప్రజలను దోచేస్తూ కమీషన్ పేరుతో అధిక మొత్తంలో రోజూ వెనకేసుకుంటున్న వైనం. అయితే ఇదంతా పెట్రోల్ పంపు యాజమాన్యానికి తెలిసే జరుగుతుందా అన్నది మాత్రం అర్థంకావట్లేదు.

ఏటీఎంల్లో ఎప్పుడూ సమస్యలే

ఏటీఎంకు వెళ్లినప్పుడల్లా ఔటాఫ్ క్యాష్, ఔటాఫ్ సర్వీస్ వంటి సమస్యలే కనిపిస్తున్నాయి. దీంతో ప్రజలు కమీషన్ ఇచ్చైనా ఆల్టర్నేటివ్ మార్గాల్లో క్యాష్ డ్రా చేసుకుంటున్నారు, అలాంటి వారికి ఈ కమీషన్ ఏజెంట్లు కనిపిస్తారు. ఈ నోటా ఆ నోటా ఇవి పాపులర్ క్యాష్ విత్రాడల్ పాయింట్లుగా మారి, కమీషన్ దందాలకు సెంటర్లుగా మారిపోతున్నాయి. ఇలాంటి వ్యాపారాలు చాలా ఊళ్లలో, చాలా షాపుల్లోనూ సాగుతున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News