శ్రీకాళహస్తి నియోజకవర్గం నాలుగు మండలాల పరిధిలో ప్రథమ శ్రేణి పురపాలక సంఘ పరిపాలన ప్రముఖ పుణ్యక్షేత్రం దక్షిణ కైలాసంగా పిలవబడే శ్రీకాళహస్తి పట్టణానికి ప్రతినిత్యం ఎంతోమంది భక్తులు పుణ్యక్షేత్రానికి వచ్చి పోతూ ఉంటారు. అయితే 36 వార్డుల కలిగిన ప్రథమ శ్రేణి శ్రీకాళహస్తి పురపాలక సంఘ పట్టణంలో ప్రజలు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా జిల్లాలోనే కాక ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిష్టాత్మకంగా కళ్యాణ మండపం కాళహస్తి కూత వేట దూరంలోనే ఉంది.
ఏళ్లు గడుస్తున్నా
ఈ భవనం నిర్మించి ఏళ్ళు గడుస్తున్న ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం శ్రీకాళహస్తి వాసుల దురదృష్టకరంగా భావించాలి. తిరుమల వెంకన్న నిధులను వెచ్చించి నిర్మించిన తిరుమల తిరుపతి దేవస్థానం కాళహస్తి వాసులకు కూతవేటు దూరంలోనే ఉండి ఇప్పటికీ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడం శ్రీకాళహస్తి వాసుల దురదృష్టకరం. స్వర్గీయ శ్రీకాళహస్తి శాసనసభ్యులు మంత్రివర్యులు తన సొంత గ్రామం ఊరందూరు శ్రీకాళహస్తిల మధ్య ఈ కళ్యాణ మండప నిర్మాణం చేపట్టడం అదేవిధంగా కళ్యాణ మండపానికి నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కావడం కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి నోచుకుంటే ఇక్కడ ఎంతోమంది తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో వివాహాలు చేసుకొని శ్రీకాళహస్తి పట్టణ ట్రాఫిక్ అంతరాయులకు దూరంగా ప్రశాంత వాతావరణంలో వివాహాలు చేసుకుని వెసులుబాటు ఉంటుందని స్థానికులు కోరుకుంటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఊరందూర వద్ద నిర్మించిన టిటిడి కళ్యాణ మండపంపై శ్రద్ధ పెట్టి శ్రీకాళహస్తి పట్టణ, గ్రామీణ వాసులకు కళ్యాణ మండపం అందిస్తారని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. సంబంధిత అధికారులు కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి కొబ్బరికాయ ఎప్పుడు కొడతారో వేచి చూద్దాం.