రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపుపై శ్రీకాళహస్తి వైసిపి పార్టీ శ్రేణుల నిరసనగ వినిపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా గృహ వినియోగదారుల పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని సామాన్యుల, బడుగు, బలహీన వర్గాల విద్యుత్ చార్జీల బారి నుంచి కాపాడాలని స్థానిక ఎస్పీడీసీఎల్ కార్యాలయం వద్ద తమ నిరసనను తెలియజేసి అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
చార్జీలు ఎత్తేస్తామని
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ట్రూ ఆఫ్ చార్జీలను ఎత్తేసి వినియోగదారుల పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలంటూ వైసీపీ శ్రేణులతో శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎస్పీడీసీఎల్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు.
కరెంట్ వాడాలంటే బెదిరిపోతున్నాం
రాష్ట్ర ప్రభుత్వం సామాన్యుల విద్యుత్ చార్జీలపై కనికరం లేకుండా 6,000 కోట్లు అధిక మొత్తాన్ని భారంగా మోపడం ఎంతవరకు న్యాయమని ఎద్దేవా చేశారు. వెంటనే ట్రూ ఆఫ్ ఛార్జ్ ఎత్తివేసి విద్యుత్ చార్జీలను సరళీకృతం చేయాలని కరెంటు వాడుకోవాలంటేనే వినియోగదారుడు భయపడే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం గృహస్థ వినియోగ దారుడికి న్యాయం చేయాలని గతంలో 200 రూపాయల విద్యుత్ చార్జి చెల్లిస్తున్న వినియోగదారుడు నేడు 1000 రూపాయలు బిల్లు చూసి ఆశ్చర్య పోతున్నారని, ప్రతి వినియోగదారుడికి 800 రూపాయలు అదనంగా విద్యుత్ చార్జీలుబిల్లు రావడం అన్యాయమని ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చార్జీలు పెంచి వినియోగదారులు నడ్డి విరిచేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేశారు. వచ్చే జనవరి నుండి మొత్తంగా 9,412 కోట్ల రూపాయలు అదనపు భారంగా విద్యుత్ వినియోగదారులపై పడనుందని మొత్తం మీద 15,485.36 కోట్ల అదనపు విద్యుత్ బిల్లును ప్రజలపై మోపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలకు కట్టుబడి ప్రభుత్వం ప్రజలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఉచిత విద్యుత్ తుంగలో తొక్కి
ఆలయ మాజీ చైర్మన్ మంజూరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు 200 యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వాడుకున్న వినియోగదారులకు ఉచిత విద్యుత్ అన్న పథకాన్ని తుంగలో తొక్కిన రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసిందని వారి పథకాలను యధావిధిగా ప్రభుత్వం అవలంబించాలని 200 యూనిట్లు కంటే తక్కువ వినియోగదారులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఏ ప్రభుత్వమైనా బడుగు బలహీనవర్గాల సామాన్యుల జోలికి వెళ్లకూడదని వారిని అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఎంతైనా ఉందని పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించి ఎస్సీ ఎస్టీల పురోభివృద్ధికి తోడ్పడవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో శరవణ కుమార్, ఉదయ్ కుమార్, ఈశ్వర రెడ్డి, హరినాథ్ నాయుడు, సురా సురేష్, పులి రామచంద్ర, వెంకటేశ్వర్లు, బాబు, మస్తాన్, భారతమ్మ, సునీత సింగ్, డాక్టర్ శంకర్, వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.