Thursday, December 26, 2024
HomeAP జిల్లా వార్తలుతిరుపతిSrikalahasti: కాళహస్తిలో ఇక ఆ సమస్యలు ఉండవు

Srikalahasti: కాళహస్తిలో ఇక ఆ సమస్యలు ఉండవు

త్వరలో..

శ్రీకాళహస్తి వచ్చే భక్తులకు దర్శనం, సేవా టికెట్లు కొనుగోలు చేయటంలో చాలా సమస్యలు వస్తున్నాయి. చాలాకాలంగా ఈమేరకు ఫిర్యాదులు వస్తున్నా పట్టించుకోని ఆలయ పెద్దలు ఇటీవలే భక్తుల సౌలభ్యంపై దృష్టిసారించే పనుల్లో పడ్డారు. భక్తుల సౌలభ్యమే శ్రీకాళహస్తీశ్వర ఆలయ ధ్యేయం అని ఆలయానికి ఇరువైపులా కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, నిర్మాణ దశలో ఉన్న కౌంటర్లను త్వరలో భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఈవో అన్నారు.

- Advertisement -

సేవా కౌంటర్లు

దినదినాభివృద్ధి చెందుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాహు కేతు పూజలకు ప్రత్యేక ఉంది. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకు సేవ కౌంటర్లను అందుబాటులో ఉంచి భక్తులకు ఎటువంటి సేవా టికెట్లు, వసతికి సంబంధించిన టికెట్లు పొందేందుకు అనుకూలంగా కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, భక్తులు వీటిని వినియోగించుకుని ఎటువంటి సమాచారం కావాలన్నా కౌంటర్ల ద్వారా సేవలందించడానికి అనుకూల ప్రదేశాల్లో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, విఐపి-ప్రోటోకాల్ దర్శనాలను ఏర్పాటు చేసేందుకు కూడా ఈ కౌంటర్లలో మరిన్ని సేవలు అందుబాటులో ఉంటాయని భక్తులు వినియోగించుకోవాలని ఈవో సందర్భంగా కోరారు.

వివిధ రకాల టికెట్లు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమాచారాన్ని సేకరించుకుని సేవలో స్వామి అమ్మవార్ల దర్శనానికి వివిధ రకాల టికెట్లను ఇక్కడ నుంచి పొందవచ్చని భక్తులకు తెలియజేశారు. అదేవిధంగా సి ఆర్ ఓ, పి ఆర్ ఓ కౌంటర్లను కూడా భక్తులకు అందుబాటులోకి తేనున్నామని వాటికి సంబంధించిన సూచక బోర్డులను అన్ని భాషల్లో ముద్రించి భక్తులకు కనపడే విధంగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News