Thursday, February 13, 2025
HomeAP జిల్లా వార్తలుతిరుపతిThandel Movie: శ్రీవారిని దర్శించుకున్న తండేల్ మూవీ టీమ్

Thandel Movie: శ్రీవారిని దర్శించుకున్న తండేల్ మూవీ టీమ్

ఆధ్మాత్మిక కేంద్రం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని తండేల్ (Thandel Movie) మూవీ టీమ్ సభ్యులు గురువారం స్వామి వారి విఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. హీరో నాగ చైతన్య(Nagachitanya), హీరోయిన్ సాయి పల్లవి(sai pallavi), దర్శకుడు చందూ మొండేటి, చిత్ర నిర్మాతలు అల్లు అరవింద్, నాగ వంశీలు స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి, పట్టువస్త్రంతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఆలయం వెలుపల దర్శకుడు చందూ ముండేటి మాట్లాడారు. సినిమా ఘన విజయం సాధించాలని నిర్మాత నాగ వంశీ శ్రీవారిని కోరుకున్నారని తెలిపారు. సినిమా మంచి హిట్ సాధించడంతో చిత్ర సభ్యులంతా శ్రీవారి దర్శనార్థం వచ్చామని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన సినిమా భారీ విజయం సాధించడంలో శ్రీవారి ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరక్కేకిన తండేల్ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి అద్భుతంగా నటించారు. ప్రేక్షకులను ఎంతగానో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ రావటంతో భారీ విజయం అందుకుంది. దీంతో చిత్ర బృందం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News