భారతీయ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం శ్రీవారి మెట్ల మార్గం ద్వారా కాలినడకన నడుచుకుంటూ రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు రిసెప్షన్ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి రాత్రి తిరుమలలో బస చేసి మంగళవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.