వెంకటేశ్వర స్వామి వారిని ధగధగ మెరిసే బంగారు ఆభరణాలు ధరించిన గోల్డ్ మ్యాన్ దర్శించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం విఐపి విరామ సమయంలో బెంగళూరుకు చెందిన రవి శ్రీవారికి మొక్కులు సమర్పించుకున్నారు. క్యూలైన్ లోని భక్తులంతా వీరిని చూస్తూ ఉండిపోయారు. వొంటిపై దాదాపు 5 కేజీల బంగారు ఆభరణాలు ధరించారు. పెద్ద పెద్ద చైన్లు, కంఠాభరణాలు ధరించిన దృశ్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి.