తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో శాస్త్రవేత్తలు యశోద, దినేష్ కుమార్ సింగ్ తదితరులు దర్శించుకున్నారు. సోమవారం ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పిఎస్ఎల్వీ సి60 నమూనాను శ్రీవారి పాదాల చెంత ఉంచి ప్రేత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా…. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.