తిరుమలలో భారీ కొండ చిలువ హలచల్ చేసింది. నిన్న మధ్యహ్నం అలిపిరి కాలినడక మార్గంలో 2500 మెట్టు వద్ద ఓ దుకాణంలో 14 అడుగుల భారీ కొండ చిలువ నక్కింది. దాన్ని చూసిన దుకాణదారులు వెంటనే స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం అందించారు.
- Advertisement -
హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న భాస్కర్ నాయుడు చాకచక్యంగా కొండ చిలువను పట్టుకున్నారు. కాలినడక మార్గంలో వచ్చిచే భక్తులు కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం కొండచిలువను అటవీ ప్రాంతంలో వదిలేశారు.