తిరుమలలో బుధవారం వేకువ జామున ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయం ముందు భక్తులు సందడి నెలకొంది. నూతన సంవత్సరంలో అడుగుపెట్టిన వేళ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ భక్తులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సంవత్సరం శ్రీవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవదేవుడిని వేడుకున్నారు. భక్తులు శ్రీవారి చెంత సంబరాలు జరుపుకోవడం ఆనందంగా వుందన్నారు.