తిరుమలలో రాం బగీచా బస్టాండ్ వద్ద ఐదు అడుగుల నాగుపాము పాము హల్ చల్ చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్టాండ్ వద్దకు నాగుపాము రావడంతో భక్తులు పరుగులు తీశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో పాములు పట్టే భాస్కర్ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఐదు అడుగుల పొడవైన నాగుపాము బుసలు కొడుతూ ఉండటంతో చాకచక్యంగా పట్టుకున్నారు. నాగుపామును భక్తులు తమ వద్ద ఉన్న సెల్ఫోన్లో ఫోటోలు తీసుకున్నారు. పామును జాగ్రత్తగా తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో వదిలేయడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.