ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పలువురు రాజకీయ ప్రముఖులు గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. వీరిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ మంత్రి విశ్వరూప్, సినీ నటుడు అశోక్ కుమార్ తదితరులు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా వీరికి టిటిడి అధికారులు ఆలయం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Tirumala: శ్రీవారిని దర్శించుకున్న రాజకీయ ప్రముఖులు
వీఐపీల తాకిడి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES